హోం మంత్రి సుచరితకు ఎన్నికల కమిషనర్ కనగరాజ్ బాగా తెలుసట: వర్ల రామయ్య

Varla Ramaiah,Telugudesam,Mekathoti Sucharitha,Kanagara,jSEC,Jagan,YSRCP

ఏపీ రాష్ట్ర కొత్త ఎన్నికల కమిషనర్ కనగరాజ్ కు సంబంధించి టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య ఆసక్తికర ఆరోపణలు చేశారు. రాష్ట్ర హోం మంత్రి సుచరితకు ఎన్నికల కమిషనర్ జస్టిస్ కనగరాజ్ బాగా తెలుసట అని వర్ల అన్నారు. ‘ఆయనది ఏ ఊరమ్మా? ఎక్కడి వారమ్మా? ముఖ్యమంత్రికి ఎలా పరిచయమమ్మా? ఏ కేసుకు సంబంధించి పరిచయమమ్మా?’ అని ప్రశ్నించారు. మన రాష్ట్రానికే పరిచయం లేని ఆయనను ఎందుకు హడావుడిగా అంత ప్రాధాన్యత కలిగిన పదవి వరించిందో కిటుకు చెప్పగలరా? అని హోం మంత్రిని నిలదీశారు.
Tags: Varla Ramaiah,Telugudesam,Mekathoti Sucharitha,Kanagara,jSEC,Jagan,YSRCP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *