జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్న వల్లభనేని వంశీ..

Vallabhaneni Vamsi, Chandrababu, Jagan, TDP vs YSRCP, Sujana Chowdaryv BJP

Vallabhaneni Vamsi, Chandrababu, Jagan, TDP vs YSRCP, Sujana Chowdaryv BJP

  • వైసీపీలో చేరనున్నట్టు ప్రకటించిన వంశీ
  • నవంబర్ 3న లేదా 4న వైసీపీ తీర్థం
  • టీడీపీలో కొనసాగేందుకు సుముఖత చూపని వంశీ

టీడీపీకి వల్లభనేని వంశీ రాజీనామా చేయడంతో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు, వంశీల మధ్య మెసేజ్ లు, లేఖలు కూడా నడిచాయి. కానీ, టీడీపీలో కొనసాగేందుకు వంశీ సుముఖత చూపలేదు. మరోవైపు, ముఖ్యమంత్రి జగన్ తో పాటు బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరితో కూడా వంశీ చర్చలు జరపడంతో… ఆయన ఏ పార్టీలో చేరబోతున్నారనే చర్చ పెద్ద ఎత్తున సాగుతోంది. ఈ సందేహాలకు వంశీ ఫుల్ స్టాప్ పెట్టారు. వైసీపీలో చేరబోతున్నట్టు ఆయన తెలిపారు. నవంబర్ 3న కానీ లేదా 4న కానీ జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకోనున్నట్టు ప్రకటించారు.
Tags: Vallabhaneni Vamsi, Chandrababu, Jagan, TDP vs YSRCP, Sujana Chowdary  BJP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *