కశ్మీర్ గవర్నర్లు వైన్ తాగుతారు.. గోల్ఫ్ ఆడతారు: గోవా గవర్నర్ సత్యపాల్ మాలిక్ వ్యాఖ్యలు

Satya Pal Malik,Jammu And Kashmir,Governor,No Work

సంచలన వ్యాఖ్యలు చేయడంలో గోవా గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఎప్పుడూ ముందువరుసలో ఉంటారు. ఇప్పటి వరకు ఆయన చేసిన ఎన్నో వ్యాఖ్యలు పతాక శీర్షికల్లోకి ఎక్కాయి. తాజాగా ఆయన మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మన దేశంలోని గవర్నర్లకు చేయడానికి ఎలాంటి పని ఉండదని ఆయన అన్నారు.

కశ్మీర్ గవర్నర్ గా పని చేసే వ్యక్తి సాధారణంగా వైన్ తాగడం, గోల్ఫ్ ఆడటం వంటివి మాత్రమే చేస్తుంటారు. ఇతర రాష్ట్రాల గవర్నర్లు ఎలాంటి గొడవలు, వివాదాల్లో తలదూర్చకుండా ప్రశాంతంగా గడుపుతుంటారని చెప్పారు. ఉత్తరప్రదేశ్ లోని బాగ్ పట్ లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన పైవ్యాఖ్యలు చేశారు. గోవా గవర్నర్ గా రాకముందు జమ్ముకశ్మీర్ రాష్ట్రానికి సత్యపాల్ మాలిక్ గవర్నర్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే.
Tags: Satya Pal Malik,Jammu And Kashmir,Governor,No Work

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *