మహేష్‌, అల్లు అర్జున్‌ సీక్రెట్‌ అండర్‌స్టాండింగ్‌?

Sarileru Neekevvaru, Ala Vaikuntapuram lo

Sarileru Neekevvaru, Ala Vaikuntapuram lo

సంక్రాంతికి విడుదలయ్యే పెద్ద సినిమాలు రెండిటికీ ఒకటే డేట్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో ఒకే రోజున వస్తాయని ప్రకటించిన తర్వాత ఇంతవరకు డేట్‌లో సర్దుబాటు ఏదీ అధికారికంగా చేయలేదు. అయితే అనధికారికంగా ఇప్పటికే రెండు పార్టీల మధ్య ఒప్పందం జరిగిపోయిందట.

ఒక సినిమా జనవరి 11న, మరొకటి 12న రావాలని డిసైడ్‌ చేసారట. అయితే ఏది ముందు రావాలనే దానిపై మాత్రం ఇంకా ఎవరూ ఒక అంగీకారానికి రాలేదు. ముందుగా వచ్చిన సినిమా బాగుందనే టాక్‌ తెచ్చుకుంటే ఫర్వాలేదు కానీ అది బాలేదనిపించుకుని, తర్వాత వచ్చినది ఫర్వాలేదనిపించుకున్నా కానీ ముందొచ్చిన చిత్రానికి చాలా చిక్కొస్తుంది. అందుకే ఈ రెండు సినిమాలలో ఏది ముందు రావాలనే దానిపై ఇంతటి గందరగోళం నెలకొంది.

అయితే బయ్యర్ల క్షేమం కోరి రెండు సినిమాలని ఒకే రోజున విడుదల చేయరాదని, అలా చేయడం వల్ల రెండు చిత్రాలకీ నష్టం వస్తుందని మాత్రం ఇరు వర్గాలు రాజీ పడడం జరిగింది. ఏ సినిమా ముందు రావాలి, ఎవరు వెనక రావాలనేది మాత్రం డిసెంబర్‌లో డెసిషన్‌ జరుగుతుంది. ప్రస్తుతానికి ఈ రెండు చిత్రాలలో అల వైకుంఠపురములోకి బజ్‌ ఎక్కువ వుంది కానీ సరిలేరు నీకెవ్వరు టీజర్‌ రిలీజ్‌ అయితే టైడ్‌ అటు తిరుగుతుందని కూడా అంచనాలున్నాయి.
TAGS: Sarileru Neekevvaru, Ala Vaikuntapuram lo, Allu Arjun, Mahesh Babu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *