కమల దళం… దేశంలోనే రిచెస్ట్ అంట

BJP Richest Party, modi amitshah
భారతీయ జనతా పార్టీ… 2014 ఎన్నికల్లో సత్తా చాటిన పార్టీ. దేశంలో సంకీర్ణ రాజకీయాలకు చరమ గీతం పాడేసి.. లోక్ సభలో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ… కేవలం తన పార్టీ ఎంపీలతోనే క్లిస్టర్ క్లియర్ మెజారిటీ సాధించిన పార్టీగా కూడా అవతరించింది. మొత్తంగా మూడు దశాబ్దాలుగా కనిపించని క్లియర్ మెజారిటీని చూపించి గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ కే మైండ్ బ్లాంకయ్యేలా చేసింది. ఇక మొన్నటి ఎన్నికల్లోనూ అదే ఫీట్ ను సాధించిన బీజేపీ… తాజాగా మరో విషయంలో సత్తా చాటింది. దేశంలోనే ధనిక పార్టీగా బీజేపీ అవతరించింది.
ఇప్పుడు దేశంలో ధనిక పార్టీ ఏదన్న ప్రశ్న వినిపించిందంటే… ఎంతమాత్రం తడుముకోకుండా బీజేపీనేనని చెప్పేసే పరిస్థితి. ఆ వివరాలు ఏమిటో చూద్దాం పదండి. గత ఆర్థిక సంవత్సరం అంటే.. 2018-19 ఏడాదికిగాను అందిన విరాళాల వివరాలను బీజేపీ వెల్లడించింది. ఆ ఆర్థిక సంవత్సరంలో వివిధ సంస్థలు, ట్రస్టుల ద్వారా మొత్తం రూ.700 కోట్ల నిధులు పార్టీకి అందినట్లు వెల్లడించింది. డిజిటల్ చెల్లింపులు, చెక్కుల రూపంలోనే ఈ మొత్తం సమకూరిందని.. ఈ మొత్తమంతా వైట్ మనీనేనని ఆ పార్టీ నేతలు కాస్తంత ఘనంగానే ప్రకటించారు.
ఈ విరాళాల్లో దాదాపు సగానికి పైగా టాటా సన్స్‌కు సంబంధించిన ట్రస్టు నుంచే వచ్చిందని తెలుస్తోంది. టాటా సన్స్‌కు చెందిన ‘ప్రోగ్రెసివ్ ఎలక్టోరల్ ట్రస్ట్’ నుంచే బీజేపీకి రూ.356కోట్ల నిధులు అందినట్లు సమాచారం. రూ.20 వేలు అంతకంటే ఎక్కువ విరాళాలను పూర్తిగా ఆన్లైన్లోనే స్వీకరించినట్లు బీజేపీ నేతలు చెబుతున్నారు. ఎలక్టోరల్ బాండ్ల నుంచి వచ్చిన విరాళాల వివరాలను ఎన్నికల సంఘానికి సమర్పించిన నివేదికలో బీజేపీ వెల్లడించకపోవడం విశేషం.
Tags: Richest Indian Political Party, BJP Richest Party, modi amitshah