కారు ప్రమాదంలో హీరో రాజశేఖర్ కు గాయాలు… ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స!

Rajashekar, ORR, Road Accident

Rajashekar, ORR, Road Accident

ఈ తెల్లవారుజామున 3 గంటల సమయంలో హైదరాబాద్, అవుటర్ రింగ్ రోడ్డుపై పెద్ద గోల్కొండ వద్ద హీరో రాజశేఖర్ ప్రయాణిస్తున్న ఫార్చ్యూనర్ కారుకు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో రాజశేఖర్ తో పాటు కారులో ప్రయాణిస్తున్న మరో వ్యక్తికి గాయాలు అయ్యాయి. వీరిద్దరికీ ప్రస్తుతం ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స జరుగుతోంది.

ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియనప్పటికీ, రాజశేఖర్ కాళ్లు, చేతులకు గాయాలు అయినట్టు సమాచారం. కారులో వెనుక కూర్చున్న వ్యక్తికి తీవ్రగాయాలు అయినట్టు తెలుస్తోంది. విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొనే నిమిత్తం వెళ్లిన రాజశేఖర్, ఆ కార్యక్రమం అనంతరం హైదరాబాద్ కు తిరిగి వస్తూ రామోజీ ఫిల్మ్ సిటీ దాటిన తరువాత, సిటీలోకి రాకుండా, నేరుగా జూబ్లీహిల్స్ కు చేరుకునే క్రమంలో అవుటర్ పై ప్రయాణించారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ప్రమాదం జరిగింది.
Tags: Rajashekar, ORR, Road Accident

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *