రజనీ .. యష్ మధ్య గట్టిపోటీ?

Rajani,Yash,Shiva Movie

రజనీకాంత్ కథానాయకుడిగా దర్శకుడు శివ ఒక భారీ బడ్జెట్ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమాకి ‘అన్నాత్తే’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన యాక్షన్ సినిమాగా ఇది నిర్మితమవుతోంది. ఈ సినిమాలో రజనీ డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నాడు. అక్టోబర్ 23వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

ఇక కన్నడలో యష్ హీరోగా ‘కేజీఎఫ్ 2’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. భారీ తారాగణం .. భారీ బడ్జెట్ తో భారీ అంచనాల మధ్య ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాను అక్టోబర్ 23వ తేదీన విడుదల చేస్తున్నట్టుగా అధికారిక ప్రకటన వచ్చేసింది. కన్నడతో పాటు తమిళ.. తెలుగు .. హిందీ భాషల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దాంతో ఈ రెండు సినిమాల మధ్య గట్టిపోటీ నెలకొంది.
Tags: Rajani,Yash,Shiva Movie

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *