కిషన్ రెడ్డి, లక్ష్మణ్ లపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు

Raja Singh, Kishan Reddy, Lakshman, BJP KCR TRS

Raja Singh, Kishan Reddy, Lakshman, BJP KCR TRS

నేను ఓడిపోవాలని కిషన్ రెడ్డి, లక్ష్మణ్ కోరుకున్నారు
అమిత్ షా జోక్యం చేసుకోవడంతో టికెట్ వచ్చింది
కేసీఆర్ ను టీఆర్ఎస్ నాయకులే ఓడిస్తారు
తెలంగాణ రాష్ట్ర పార్టీ నాయకత్వం తనను కనీసం గుర్తించడం లేదని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వాపోయారు. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి తన నియోజకవర్గ పర్యటనకు వచ్చినప్పుడు కూడా… తనకు సమాచారం ఉండటం లేదని ఆరోపించారు. దత్తాత్రేయ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ప్రొటోకాల్ ను కచ్చితంగా పాటించేవారని చెప్పారు.

గత ఎన్నికల్లో తాను ఓడిపోవాలని కిషన్ రెడ్డి, లక్ష్మణ్ కోరుకున్నారని రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు టికెట్ రాకుండా చేసేందుకు కూడా యత్నించారని, కానీ అమిత్ షా జోక్యం చేసుకోవడంతో తనకు టికెట్ వచ్చిందని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీకి సమర్థుడైన నాయకుడు కనిపించడం లేదని అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కావాలని రాష్ట్ర బీజేపీ నేతల్లో నలుగురైదుగురు కలలు కంటున్నారని చెప్పారు.

దిశను నలుగురు దుర్మార్గులు కిరాతకంగా చంపేశారని… వారు బయటకు వస్తే వారిని తాను కూడా అలాగే చంపుతానని రాజాసింగ్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ను ఎవరూ ఓడించాల్సిన అవసరం లేదని… ఆయనను టీఆర్ఎస్ నాయకులే ఓడిస్తారని చెప్పారు.
Tags: Raja Singh, Kishan Reddy, Lakshman, BJP KCR TRS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *