బీజేపీతో ప‌వ‌న్.. ఆయ‌న సంకేతాలిచ్చేశాడు

pawan kalyan, bjp iyr, central minister krishan rao

pawan kalyan, bjp iyr, central minister krishan rao

కేంద్రంలో అధికారంలో ఉన్న భార‌తీయ జ‌న‌తా పార్టీతో క‌లిసి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రాజ‌కీయం చేయ‌డానికి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ రెడీ అవుతున్నాడ‌న్న‌ది ఇప్పుడు తెలుగు ప్ర‌జ‌ల్లో హాట్ టాపిక్. ఉన్నట్లుండి పవన్ ఈ ఏడాది మార్చి-ఆగస్టు మధ్య చేసిన పొలిటికల్ ట్వీట్లను డెలీట్ చేయడంపై చ‌ర్చ‌నీయాంశంగా మారిన సంగ‌తి తెలిసిందే.

భారతీయ జనతా పార్టీతో పవన్ సత్సంబంధాలు నెరుపుతున్నారని.. ఆ పార్టీతో జనసేన కలిసి పని చేసే అవకాశముందని.. ఈ నేపథ్యంలోనే ఎన్నికల సందర్భంగా భాజపాను టార్గెట్ చేసిన ట్వీట్లను పవన్ తొలగించాడని అంటున్నారు. ఇటీవలి పవన్ ఢిల్లీ పర్యటనతో కూడా దీన్ని ముడిపెడుతున్నారు.

ఇలాంటి త‌రుణంలోనే మాజీ ఐఏఎస్ అధికారి, ప్ర‌స్తుత భాజ‌పా పార్టీ స‌భ్యుడు అయిన ఐవీఆర్ కృష్ణారావు ఒక ఇంట‌ర్వ్యూలో ప‌వ‌న్, భాజ‌పా మైత్రి గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. గ‌త ఐదేళ్లు ముఖ్య‌మంత్రిగా ఉన్న చంద్ర‌బాబు నాయుడు భాజ‌పా గురించి విప‌రీత‌మైన దుష్ప్ర‌చారం చేశార‌ని.. అది జ‌నాలు కూడా న‌మ్మార‌ని.. ఇప్పుడు దాన్నంతా రివ‌ర్స్ చేయ‌గ‌ల స‌త్తా ప‌వ‌న్‌కు మాత్ర‌మే ఉంద‌ని తాను న‌మ్ముతున్నాన‌ని అన్నారు.

ప‌వ‌న్‌తో త‌న‌కు అనుబంధం ఉంద‌ని చెప్పిన ఐవీఆర్.. భాజ‌పాతో ప‌వ‌న్ చేతులు క‌ల‌ప‌డానికి మీ వంతుగా ఏదైనా ప్ర‌య‌త్నం చేస్తున్నారా అని అడిగితే.. ప‌వ‌న్ పెద్ద స్టేచ‌ర్ ఉన్న వ్య‌క్తి అని.. ఆయ‌న కేంద్ర స్థాయిలోనే సంప్ర‌దింపులు జ‌రుపుతున్నార‌ని చెప్ప‌డం ద్వారా ప‌వ‌న్ ఒక ప్ర‌ణాళిక ప్ర‌కార‌మే భాజ‌పాతో చేతులు క‌లిపే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని స్ప‌ష్టం చేశారు.
Tags: pawan kalyan, bjp iyr, central minister krishan rao

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *