పార్లమెంటు ఉభయసభలు ప్రారంభం..కోడెల శివప్రసాద్ కు సంతాపం

Parliament, Winter Sessions

Parliament, Winter Sessions

  • వచ్చే నెల 23 వరకు జరగనున్న శీతాకాల సమావేశాలు
  • 26న రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఉమ్మడిగా సమావేశం కానున్న ఉభయసభలు
  • ఇటీవల మృతి చెందిన నేతలకు సంతాపం తెలిపిన పార్లమెంటు

ఈ ఏడాది పార్లమెంటు చిట్టచివరి సమావేశాలు ప్రారంభమయ్యాయి. జాతీయగీతాలాపనతో ఉభయసభలు ప్రారంభమయ్యాయి. రాజ్యసభలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, లోక్ సభలో స్పీకర్ ఓం బిర్లాలు సమావేశాలను ప్రారంభించారు. రాజ్యసభ 250వ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో, ఈ సమావేశాలకు ప్రాధాన్యత ఏర్పడింది. సమావేశాలు ప్రారంభమైన వెంటనే కొత్తగా ఎన్నిక కాబడ్డ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు.

అనంతరం, ఇటీవల మృతి చెందిన అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్, రాం జెఠ్మలానీ, కోడెల శివప్రసాద్ లతో పాటు ఇతర నేతలకు ఉభయసభలు సంతాపం తెలిపాయి. ఈ సమావేశాల్లో పౌరసత్వ బిల్లుతో పాటు పలు కీలక బిల్లులు చర్చకు రానున్నాయి. వచ్చే నెల 23వ తేదీ వరకు ఈ శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. ఈనెల 26న రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఉభయసభలు ఉమ్మడిగా సమావేశం కానున్నాయి.
Tags: Parliament, Winter Sessions

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *