లాక్‌డౌన్‌ పై కేంద్ర మంత్రులు, అధికారులతో ప్రధాని మోదీ కీలక భేటీ

Narendra Modi,BJP,Lockdown,Corona Virus

కరోనా విజృంభణ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం విధించిన‌ లాక్‌డౌన్ ఎల్లుండితో ముగుస్తుంది. అయితే, దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతూనే ఉంది. లాక్‌డౌన్‌ ఎత్తివేయాలని, లేదంటే దేశ ఆర్థిక వ్యవస్థకు నష్టం వాటిల్లడమే కాకుండా పేదలు ఆకలితో మరణిస్తారంటూ నిపుణులు హెచ్చరికలు చేస్తోన్న వేళ.. ఈ రోజు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో ఈ విషయంపై కీలక సమావేశం ప్రారంభమైంది.

ఈ సమావేశానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రైల్వే, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్, కేబినెట్ కార్యదర్శి రాజీవ్‌ గౌబాతో పాటు పలువురు అధికారులు హాజరయ్యారు. లాక్‌డౌన్‌ ఎత్తివేత లేక కొనసాగింపు, సడలింపులు, తదుపరి కార్యాచరణపై మోదీ కీలక చర్చలు జరుపుతున్నారు. ఈ విషయంపై మోదీ నిర్ణయం తీసుకుని ఈ రోజు లేదా రేపు కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Tags: Narendra Modi,BJP,Lockdown,Corona Virus

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *