ఇదో మెలోడియస్ మెసేజ్: నరేంద్ర మోదీ

Narendra Modi Song Twitter jayathu jayathu bharatham song

“జయతు జయతు భారతం – వసుదేవ్ కుటుంబకం…” అంటూ దాదాపు 200 మందికి పైగా సంగీత కళాకారులు పాడిన ఓ పాట వైరల్ కాగా, ఈ పాటపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఆయన ఓ ట్వీట్ ను పెడుతూ, “ఈ పాట ప్రతి ఒక్కరినీ అద్భుతానికి గురి చేసింది. ప్రతి ఒక్కరినీ కార్యోన్ముఖులయ్యేలా ప్రేరేపిస్తున్నదని అన్నారు. ‘ఆత్మ నిర్భర్’కు ఓ మెలోడియస్ మెసేజ్ ని ఇచ్చింది” అని ట్వీట్ చేశారు.

కాగా, ఈ పాటను తొలుత భారతరత్న లతా మంగేష్కర్ షేర్ చేసిన సంగతి తెలిసిందే. ఇండియన్ సింగర్స్ అసోసియేషన్ లో సభ్యులుగా ఉన్న 211 మంది ఈ పాటను ఆలపించారు. భారతావని స్వయం సమృద్ధం కావాలన్న లక్ష్యాన్ని ప్రేరేపిస్తూ పాట సాగుతుంది. ఆశా బోంస్లే, సోనూ నిగమ్, శంకర్ నారాయణ్, షాన్, ఉషా ఉతప్, ప్రసూన్ జోషి తదితరులు ఎందరో ఈ పాటలో భాగమయ్యారన్న సంగతి తెలిసిందే.
Tags: Narendra Modi Song Twitter jayathu jayathu bharatham song

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *