కేటీఆర్ బ‌య‌ట‌కు రావ‌డం లేదు ఎందుకు..?

KTR, KCR Telangana, TRS

KTR, KCR Telangana, TRS

కేటీఆర్‌.. గులాబీ ద‌ళ‌ప‌తి, ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌ర్వాత స్థానం ఆయ‌న‌దే.. ఇది ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌గా, మంత్రిగా కేటీఆర్ పార్టీలో, ప్ర‌భుత్వంలో అత్యంత కీల‌క నేత‌గా ఆయ‌న కొన‌సాగుతున్నారు. అయితే.. ఇందుకు బ‌ల‌మైన కార‌ణాలే ఉన్నాయి. రెండో మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో అవ‌కాశం ద‌క్కించుకున్న కేటీఆర్‌కు అనుకోని అవ‌రోధాలు ఎదుర‌వుతున్నాయి. ప‌రిస్థితుల‌న్నీ ప్ర‌తికూలంగా మారుతున్నాయి.

రాష్ట్ర పుర‌పాల‌క‌, ఐటీశాఖ మంత్రిగా కేటీఆర్‌ బాధ్య‌త‌లు చేప‌ట్ట‌గానే.. గులాబీ శ్రేణులు, అభిమానులు సంబ‌రాలు చేసుకున్నారు. ఇక్క‌డ మ‌రొక విష‌యం ఏమిటంటే.. అనేక ఐటీ కంపెనీలు ఆయ‌న రాక‌కోసం ఎదురుచూశాయి. ఆయ‌న మంత్రి అయిన త‌ర్వాత‌నే ప్రారంభోత్స‌వాలు చేయాల‌ని ప‌లు జిల్లాల్లో కొత‌గా ఏర్పాటు అయిన‌ కంపెనీలు అనుకున్నాయి. అనుకున్న‌ట్లుగానే ఆయ‌న ఐటీశాఖ మంత్రి అయ్యారు.

కానీ.. ఇక్క‌డే అనుకోని ట్విస్ట్.. తెలంగాణ ఆర్టీసీ కార్మికులు అక్టోబ‌ర్ 5వ తేదీ నుంచి స‌మ్మె ప్రారంభించారు. దీంతో కేటీఆర్ ప‌ర్య‌ట‌న‌ల‌కు చెక్‌పడింది. నిజానికి ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లా హుజూర్‌న‌గ‌ర్ ఉప ఎన్నిక‌ల ప్ర‌చారంలో అక్టోబ‌ర్ 4న ఆయ‌న చివ‌రి ప‌ర్య‌ట‌న అని చెప్పుకోవ‌చ్చు. ఆ త‌ర్వాత ఆయ‌న హైద‌రాబాద్‌లో, స‌మీపంలో చేప‌ట్టిన ఒక‌టి రెండు కార్య‌క్ర‌మాల్లో కేటీఆర్ పాల్గొన్నారు. అంతే అక్టోబ‌ర్ 5వ తేదీ నుంచి కేటీఆర్ బ‌య‌ట‌కు రావ‌డం లేదు… అనేకంటే రాలేక‌పోతున్నార‌నే చెప్పాలి.

కేటీఆర్ ప్ర‌జాక్షేత్రంలోకి రాక‌పోవ‌డంతో ఎక్క‌డిక‌క్క‌డ ప్రారంభోత్స‌వాలు ఆగిపోయాయి. అయితే.. ఆర్టీసీ కార్మికుల స‌మ్మె నేప‌థ్యంలోనే కేటీఆర్ ప‌ర్య‌ట‌న‌లు ర‌ద్దు అవుతున్నాయని చెప్పొచ్చు. ప్ర‌స్తుతం స‌మ్మె రోజురోజుకూ ఉధృతం అవుతోంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఒక‌వేళ బ‌య‌ట‌కు వ‌స్తే.. ఊహించ‌ని విధంగా నిర‌స‌న‌ల‌తో ప‌రాభ‌వం ఎదురైతే.. మొత్తంగా ఇమేజ్ డ్యామేజ్ అవుతుంద‌న్న ఆందోళ‌న‌తోనే కేటీఆర్ బ‌య‌ట‌కు రాలేక‌పోతున్నార‌ని టాక్ గులాబీ శ్రేణుల్లో వినిపిస్తోంది. మ‌రి వీటిని ప‌టాపంచులు చేస్తూ కేటీఆర్ ఎప్పుడు బ‌య‌ట‌కు వ‌స్తారో ? చూడాలి.
TAGS: KTR, KCR Telangana, TRS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *