ఆ బాడీ ఏంట్రా నాయనా?: ఎన్టీఆర్ పై రామ్ గోపాల్ వర్మ కామెంట్ వైరల్!

Junior NTR, Vrama Twitter, Six Pack

ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన వ్యాయామ శిక్షకుడు పెట్టిన సిక్స్ ప్యాక్ ఫోటో ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. దీనిపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సైతం స్పందించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టిన ఆయన, “హాయ్ తారక్. నేను స్వలింగ సంపర్కుడిని కాదన్న సంగతి నీకు బాగా తెలుసు. అయితే ఈ ఫొటోలో నిన్ను చూసిన తరువాత నేను అలా ఉంటే బాగుండేది అనిపిస్తోంది. ఆ బాడీ ఎంట్రా నాయనా” అంటూ ట్వీట్ చేశారు. కాగా, ‘టెంపర్’ సినిమా కోసం సిక్స్ ప్యాక్ చేసిన ఎన్టీఆర్, ఇప్పుడు మరోసారి మరింత ఫిట్ గా కనిపిస్తూ ఉండటంతో ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. వర్మ పెట్టిన కామెంట్ వైరల్ అవుతోంది.
Tags: Junior NTR, Vrama Twitter, Six Pack

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *