వైసీపీ పిచ్చి పరాకాష్టకు చేరింది..: కన్నా లక్ష్మీనారాయణ

KannaBJPYSRCP

KannaBJPYSRCP

ఇసుకకు, ఇంద్రధనుస్సుకు కూడా పార్టీ రంగులు వేసేలా ఉన్నారు
అన్నవరంలో అన్యమత ప్రచారం జరిగింది
భీమిలి ఉత్సవ్ లో మతపరమైన స్టాల్స్ ఏర్పాటు చేశారు
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తప్పుబట్టారు. వైసీపీ పిచ్చి పరాకాష్టకు చేరిందని ఆయన మండిపడ్డారు. బడినీ, గుడినీ వదలని వైసీపీ వాళ్లు చివరకు ఇసుకకు, ఇంద్రధనుస్సుకు కూడా వారి పార్టీ రంగులు వేసేలా ఉన్నారంటూ ఎద్దేవా చేశారు.

అన్నవరంలో అన్యమత ప్రచారం జరిగిందని, భవానీ ఐలాండ్ లో ఆర్చిపై బొమ్మలను ఏర్పాటు చేశారని, భీమిలి ఉత్సవ్ లో మతపరమైన స్టాల్స్ ఏర్పాటు చేశారని… ఇవన్నీ వైసీపీ చేపట్టిన మత వ్యాప్తిని సూచిస్తున్నాయని మండిపడ్డారు.
Tags: Kanna, BJP YSRCP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *