మారిన ‘డిస్కో రాజా’ రిలీజ్ డేట్

disco raja movei updates

disco raja movei updates

* అనుష్క కథానాయికగా గతంలో వచ్చిన ‘అరుంధతి’ చిత్రం ఘన విజయాన్ని సాధించిన సంగతి విదితమే. ఇప్పుడీ చిత్రాన్ని బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారు. ఇందులో కథానాయికగా దీపికా పదుకొనే నటిస్తుందని తాజా సమాచారం.
* రవితేజ కథానాయకుడుగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘డిస్కో రాజా’ చిత్రం రిలీజ్ డేట్ మారింది. మొదట్లో ఈ చిత్రాన్ని డిసెంబర్ 20న విడుదల చేయడానికి ప్లాన్ చేయగా, తాజాగా వచ్చే ఏడాది జనవరి 24కి దీని విడుదలను మార్చారు.
* తన సంచలన కామెంట్లతో నిత్యం వార్తలలో నిలిచే టాలీవుడ్ నటి శ్రీరెడ్డి తాజాగా ఓ చిత్రంలో మంచి అవకాశాన్ని పొందింది. భవానీ శంకర్ దర్శకత్వంలో రూపొందే ‘క్లైమాక్స్’ చిత్రంలో సినిమా నటి పాత్రలో ఆమె కనిపిస్తుంది. ఇందులో రాజేంద్రప్రసాద్, పృథ్వీ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
Tags: disco raja, Deepika Padukone, Anushka Shetty, Raviteja, Srireddy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *