అమెరికాలో కరోనా విశ్వరూపం.. ప్రపంచంలో తాజా పరిస్థితి ఇదీ!

COVID-19,America,New York,Italy,Spain,China

ప్రాణాంతక కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచం మొత్తం విలవిల్లాడుతోంది. చైనాలో పుట్టి కొన్ని రోజులపాటు అక్కడ గడగడలాడించిన ఈ వైరస్ ఆ తర్వాత ప్రపంచమంతా విస్తరించింది. యూరప్ దేశాలపై పంజా విసిరిన ఈ మహమ్మారి ఇటలీ, స్పెయిన్‌లను కోలుకోలేని విధంగా దెబ్బతీసింది.

ప్రస్తుతం అమెరికాలో మరింత రెచ్చిపోయి ప్రవర్తిస్తోంది. దాని దెబ్బకు అమెరికాలో ప్రతీ రెండున్నర నిమిషాలకు ఓ మరణం సంభవిస్తోంది. ఇక న్యూయార్క్‌లో అయితే పరిస్థితి మరింత దారుణంగా ఉంది. దేశంలో ఇప్పటి వరకు 10 వేల 7 వందల  మందికిపైగా మృత్యువాత పడగా, ఒక్క న్యూయార్క్‌లోనే 4,758 మంది మృతి చెందారు. దేశవ్యాప్తంగా ఒక్క రోజులోనే ఏకంగా 1150 మంది మృతి చెందారు. మరోపక్క, ఇటలీ, స్పెయిన్‌లలో గత వారం రోజులుగా మరణాల రేటు తగ్గుతుండడం కొంత ఊరటనిచ్చే అంశం.

ప్రపంచవ్యాప్తంగా నిన్నటి వరకు మొత్తం 72,636 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క యూరప్‌లోనే 50,215 మంది మరణించారు. మొత్తం 13 లక్షల మందికిపైగా కరోనా బారినపడ్డారు. నిన్నటి వరకు ఇటలీలో 16,523 మంది, స్పెయిన్‌లో 13,169 మంది మృతి చెందారు. ఫ్రాన్స్‌లో 8,911 మంది బలికాగా, ప్రపంచవ్యాప్తంగా 2.75 లక్షల మంది కరోనా నుంచి తప్పించుకుని బయటపడ్డారు. ఇక, వైరస్ పురుడుపోసుకున్న చైనాలో మాత్రం 3,331 మరణాలే సంభవించాయి. కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడంతో కోవిడ్-19 కబంధ హస్తాల నుంచి చైనా త్వరగానే తప్పించుకోగలిగింది.

Tags: COVID-19,America,New York,Italy,Spain,China

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *