వైసీపీ ఎంపీ విజయసాయికి బుద్ధా వెంకన్న మస్కిటో చాలెంజ్!

‘దోమలపై దండయాత్ర’ను ఎద్దేవా చేశారుగా
ఇప్పుడు మీరు నానా తంటాలు పడుతున్నారు
వైసీపీ నాయకులంతా ఈ చాలెంజ్‌ను స్వీకరించాలి
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మస్కిటో చాలెంజ్ విసిరారు. గతంలో తాము చేపట్టిన ‘దోమలపై దండయాత్ర’ కార్యక్రమాన్ని ఎద్దేవా చేసిన విజయసాయిరెడ్డికి తాను మస్కిటో చాలెంజ్‌ను విసురుతున్నట్టు బుద్ధా చెప్పారు. తాడేపల్లిలోని సీఎం జగన్ నివాస ప్రాంతంలో దోమలను అరికట్టేందుకు నానా తంటాలు పడుతున్నట్టు తెలుస్తోందని పేర్కొన్న బుద్ధా.. తక్కువ ఖర్చు అయ్యే బ్యాట్‌‌లతో దోమలను నివారించినా విజయసాయి గెలిచినట్టేనని పేర్కొన్నారు.

రాష్ట్రంలో నమోదవుతున్న డెంగీ, మలేరియా జ్వరాల్లో అత్యధికశాతం తాడేపల్లిలోనే నమోదవుతున్నాయని అన్నారు. మస్కిటో చాలెంజ్‌లో విజయసాయి గెలిచిన తర్వాత ఆర్థిక నిపుణుడు, దోమల ఎక్స్‌పెర్ట్ అయిన బుగ్గనకి ఆ చాలెంజ్ విసరాలని సూచించారు. అలా, ఒకిరికి ఒకరు మస్కిటో చాలెంజ్‌ను విసురుకుంటూ వైసీపీ నాయకులంతా పోటీపడి ప్రజల్ని దోమల బారి నుంచి తద్వారా జ్వరాల బారి నుంచి బయటపడేయాలని బుద్ధా కోరారు.
Tags: Buddha Venkanna, Vijayasai Reddy, Mosquito Challenge

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *