‘బిగ్ బాస్-4’కి వినిపిస్తున్న కొత్త పేర్లు!

Bigg Boss telugu4, Tarun, Mangli

టీవీ రియాలిటీ షోలలో ‘బిగ్ బాస్’ షోకు వున్న క్రేజే వేరు..
ఆ కాన్సెప్ట్ .. ఆ టాస్కులు.. ఆ మాటలు…ఆ డ్రామా … అంతా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. దానికి తోడు ఓ పెద్ద ఫిలిం స్టార్ దానికి హోస్టుగా వుండడం మరింత ఆకర్షణీయం అవుతుంది. అందుకే దీనికి మంచి టీఆర్పీ కూడా వస్తుంది.

ఈ క్రమంలో ఇప్పటికి ఈ షో మూడు సీజన్లు పూర్తి చేసుకోగా, త్వరలో నాలుగో సీజన్ ప్రారంభం కానుంది. ఇక ఇందులో పాల్గొనే పార్టిసిపేంట్స్ ఎవరన్న దానిపై గత కొన్ని రోజులుగా బోలెడు పేర్లు వినవస్తున్నాయి. తాజాగా మరికొన్ని పేర్లు ప్రచారంలోకి వచ్చాయి.

గతంలో పలు సినిమాలలో నటించి, రొమాంటిక్ హీరోగా పేరు తెచ్చుకున్న తరుణ్ ఇందులో ఒక పార్టిసిపేంట్ గా ప్రత్యేక ఆకర్షణ కానున్నాడని అంటున్నారు. అలాగే, జానపద గీతాల గానంతో పేరుతెచ్చుకున్న మంగ్లీ కూడా పాల్గొంటుందని సమాచారం. ఇంకా టీవీ యాంకర్లు వర్షిణి, జాహ్నవి తదితరులతో ప్రస్తుతం సంప్రదింపులు జరుగుతున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే ఎవరిని ఎంపిక చేశారనేది వెల్లడవుతుంది.

ఇక మొదట్లో షెడ్యూల్ ప్రకారం జూన్ నుంచి ప్రసారం చేయాలనుకున్న ఈ బిగ్ బాస్ 4 సీజన్ లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. త్వరలోనే మళ్లీ కొత్త షెడ్యూల్ ప్రకటిస్తారు.
Tags: Bigg Boss telugu4, Tarun, Mangli

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *