అయోధ్య రాముడి కోసం 2100 కిలోల గంట… ప్ర‌త్యేక‌త‌లు ఇవే…

Ayodhya, Babri Case, India UP

దాదాపు 130 సంవ‌త్స‌ర‌లుగా అయోధ్య‌లో అటు హిందువుల‌కు, ఇటు ముస్లింల‌కు మ‌ధ్య అత్యంత వివాస్ప‌దంగా ఉన్న బాబ్రీ కేసు సుప్రీంకోర్టు తీర్పుతో కొలిక్కి వ‌చ్చింది. సుప్రీం అలా తీర్పు ఇచ్చిందో లేదో వెంట‌నే రామ‌మందిర నిర్మాణ ప‌నులు షూరూ అయిపోయాయి. అక్క‌డ ఉన్న స్థ‌లాన్ని హిందువుల‌కు ఇచ్చి… మ‌సీదు నిర్మాణం కోసం మ‌రో ఐదు ఎక‌రాలు కేటాయించాల‌ని సుప్రీంచారిత్రాత్మ‌క తీర్పు చెప్పిన సంగ‌తి తెలిసిందే.

ఇక సుప్రీం తీర్పుతో అక్క‌డ అన్ని వ‌ర్గాల నుంచి సానుకూల స్పంద‌న ల‌భిస్తోంది. ఇక ఈ ప్రతిష్టాత్మక రామ మందిరంలోకి ఘనమైన గంట కూడా తయారవుతోంది. ఈ గంట‌కు చాలా ప్ర‌త్యేక‌త‌లు కూడా ఉన్నాయి. ఇక్బాల్ అనే ముస్లిం యువ‌కుడు ఈ గంట‌ను త‌యారు చేస్తున్నాడు. యూపీలోని జలేసర్‌లో ఈ గంట త‌యార‌వుతోంది. ఈ గంట‌కు మొత్తం రు.10 లక్ష‌లు ఖ‌ర్చు చేస్తున్న‌ట్టు ఇక్బాల్ చెపుతున్నాడు.

ఈ ప‌నుల‌ను ప‌ర్య‌వేక్షిస్తోన్న వికాస్ మిట్ట‌ల్ మాట్లాడుతూ అయోధ్య‌లోని రామ‌మందిరం నిర్మాణం కోసం ఎన్నో ప్ర‌త్యేక‌త‌ల‌తో రూపొందిస్తోన్న ఈ గంట బ‌రువు మొత్తం 2100 కిలోలు ఉంటుంద‌ని చెప్పాడు. ఇక ఈ గంట కోసం అనేక లోహాల మిశ్ర‌మాన్ని వాడుతున్నారు. ఇలాంటివే మ‌రో 10 గంట‌లు కూడా త‌యారు చేస్తున్నార‌ట‌.

ఈ గంట ఎత్తు ఆర‌డుగులు ఉండ‌నుంది. ఇక అయోధ్య‌లో రామ‌మందిర నిర్మాణానికి గ్రీన్‌సిగ్న‌ల్ రావ‌డంతో అయోధ్య‌లో ఎక్క‌డ చూసినా సంద‌డి నెల‌కొంది. ఈ ప్రాంతంలో ఉన్న చేతివృత్తిదారులు అంద‌రికి ఇప్పుడు మంచి డిమాండ్ ఏర్ప‌డింది. అనేక వ‌స్తువుల‌కు సంబంధించి ఫుల్ ఆర్డర్లు రావ‌డంతో వారంతా ఫుల్ ఖుషీగా ఉన్నారు.
TAGS: Ayodhya, Babri Case, India UP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *