నీ ఇష్టమున్నచోట చెప్పుకో అంటూ.. ఎస్సై దురుసు ప్రవర్తన

attack on media corona effects, guntur si, latest telugu news, Telugu breaking news telugu ,news today news

గుంటూరు: లాక్ డౌన్ అమలు కార్యక్రమంలో ఎస్సై మధుపవన్ మీడియాపై వీరంగం సృష్టించాడు. డీఎస్పీ కార్యక్రమానికి వెళ్తున్న మీడియా ప్రతినిధిపై దురుసుగా ప్రవర్తించాడు. దీంతో ఇదేంటని ప్రశ్నించినందుకు మీ ఇష్టం ఉన్న చోట చెప్పుకోండంటూ దురుసుగా ప్రవర్తించి అక్రిడిటేషన్ కార్డును విసిరి కొట్టాడు.

ప్రభుత్వ అనుమతి ఉన్న వాహనాలనూ నిలిపివేస్తూ దౌర్జన్యం సృష్టిస్తున్నట్టు తెలిపారు. ఎస్పీకి కాకపోతే డీజీపీకి చెప్పుకోండి అంటూ హెచ్చిరించినట్టు తెలిపారు. మీడియాపైనే ఇలా ప్రవర్తించిన వారు సామాన్య రైతులపై ఎలా ప్రవర్తిస్తారు అంటూ మీడియా ప్రతినిధులు వాపోయారు. ఆ ఎస్సైపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు.

Tags: attack on media corona effects, guntur si, latest telugu news, Telugu breaking news telugu ,news today news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *